SREYAS ASTRO Logo
SREYAS ASTRO | శ్రీ వైష్ణవ అనుష్ఠాన మార్గదర్శి

గాయత్రీ జపం వైష్ణవ సంకల్పం & సంపూర్ణ మంత్ర విధి 2026

శ్రావణ కృష్ణ పాడ్యమి గాయత్రీ జపం సంకల్పం, ప్రాణాయామం, ఆవాహనం, 1008 జప విధానం, ఉపస్థానం & దిగ్వందనం

📅 28.08.2026 — శుక్రవారం (Friday)

శ్రావణ బహుళ పాడ్యమి (పరాభవ నామ సంవత్సరం)

📌 తిథి వివరాలు: పౌర్ణమాస్యాం (ఉదయం 10:30 వరకు) // ప్రథమాయాం (ఉదయం 10:31 నుండి)

🌟 గాయత్రీ జపం మహత్యం & ప్రాశస్త్యం:

శ్రావణ పూర్ణిమ (జంధ్యాల పౌర్ణమి) మరుసటి రోజున ఉదయమే ప్రాతఃసంధ్యావందనం పూర్తి చేసుకుని 1008 సార్లు గాయత్రీ జపం చేయడం అమోఘమైన బ్రహ్మతేజస్సును ప్రసాదిస్తుంది. శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు భగవత్ కైంకర్య రూపంగా గాయత్రీ మహామంత్రాన్ని అనుష్ఠించడం వలన గడచిన సంవత్సర పాపములు నశించి, సర్వ శుభములు, మేధాశక్తి మరియు ఆయురారోగ్యములు లభిస్తాయి.

1. గాయత్రీ జపం ప్రారంభ సంకల్పం

స్నానానంతరం కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని ఆచమనం (అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః) చేయాలి. పవిత్ర వేలికి దర్భ పవిత్రం ధరించి, 2 దర్భలను ఆసనంగా వేసుకోవాలి.

(చేతులు జోడించి) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే, యస్యాద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే.

(కుడి తొడపై చేతులు ఉంచుకుని) శ్రీ గోవింద గోవింద గోవింద... అస్య శ్రీభగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యవహారికే ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే...

పరాభవ నామ సంవత్సరే - దక్షిణాయనే - వర్ష ఋతౌ - సింహ మాసే (శ్రావణ మాసే) - కృష్ణ పక్షే - ప్రథమాయాం శుభతిథౌ - భృగు వాసర యుక్తాయాం - శతభిషక్ నక్షత్రయుక్తాయాం

శ్రీవిష్ణుయోగ శ్రీవిష్ణుకరణ శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం ప్రథమాయాం శుభతిథౌ
శ్రీభగవదాజ్ఞా భగవత్కైంకర్యరూపం మిథ్యాబ్రాహ్మణ ప్రతిగ్రహ ప్రయుక్తానాం దైత్యదాన ప్రయుక్తానాం ఏవమాదీనాం ఉపాత్త సమస్త పాపక్షయార్థం, సంవత్సరోపాకర్మ ప్రాయశ్చిత్తార్థం అష్టోత్తర శత సంఖ్యా (108 సార్లు) / అష్టోత్తర సహస్ర సంఖ్యా (1008 సార్లు) గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే.

2. ప్రాణాయామం, న్యాసము & ధ్యానము

ప్రణవస్య ఋషిః బ్రహ్మా, దేవీగాయత్రీ ఛందః, పరమాత్మా దేవతా |
భూరాది సప్తవ్యాహృతీనాం — అత్రి భృగు కుత్స వసిష్ఠ గౌతమ కాశ్యప ఆంగీరస ఋషయః — గాయత్రీ ఉష్ణిక్ అనుష్టుప్ బృహతీ పంక్తి త్రిష్టుప్ జగత్యః ఛందాంసి — అగ్ని వాయు అర్క వాగీశ వరుణ ఇంద్ర విశ్వేదేవాః దేవతాః |
సావిత్ర్యా ఋషిః విశ్వామిత్రః — దేవీగాయత్రీ ఛందః — సవితా దేవతా |
గాయత్రీశిరసో బ్రహ్మఋషిః — అనుష్టుప్ ఛందః — పరమాత్మా దేవతా |
అని న్యాసము చేసి, సర్వేషాం ప్రాణాయామే వినియోగః అని పలికి 10 సార్లు ప్రాణాయామం చేయాలి.
📌 గాయత్రీ ధ్యాన శ్లోకం:

ముక్తావిద్రుమ హేమనీలధవళచ్ఛాయైః ముఖైస్త్రీక్షణైః |
యుక్తామిందుకలానిబద్ధ మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గుణం |
శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే ||

(సావిత్రీ దేవతను ధ్యానించి, “ఓం ఆపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్” అని శిరస్సు నుండి పాదముల వరకు రెండు చేతులతో తాకాలి).

📌 గాయత్రీ ఆవాహనం:
ఆయాత్విత్యనువాకస్య వామదేవఋషిః — అనుష్టుప్ ఛందః — గాయత్రీ దేవతా — గాయత్రీ ఆవాహనే వినియోగః

ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసమ్మితమ్ |
గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వ నః ||
ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామ నామాసి విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయుః — అభిభూరోం గాయత్రీం ఆవాహయామి |


సావిత్ర్యా ఋషిః విశ్వామిత్రః — దేవీగాయత్రీ ఛందః — సవితా దేవతా — జపే వినియోగః |
యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యత్తేజః తద్వరేణ్యముపాస్మహే ||

3. గాయత్రీ మహామంత్ర జపం (1008 / 108 సార్లు)

సూర్యమండల మధ్యవర్తియైన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ, రెండు చేతులను ఉత్తరీయంతో కప్పి ఉంచి, కుడిచేతి చిటికెన వేలు అడుగు గీత నుండి మొదలుపెట్టి ప్రదక్షిణంగా కరమాలికతో 1008 లేదా 108 సార్లు జపించాలి:

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యం |
భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ ||

4. గాయత్రీ ఉపస్థానం & ఉద్వాసన

ప్రాణాయామం చేసి, నిలబడి శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు సంకల్పం చేయాలి:

శ్రీ భగవదాజ్ఞా భగవత్కైంకర్యరూపం (శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం) ప్రాతః సంధ్యా-ఉపస్థానం కరిష్యే.

ఉత్తమ ఇత్యనువాకస్య వామదేవఋషిః — అనుష్టుప్ ఛందః — గాయత్రీ దేవతా — గాయత్రీ ఉద్వాసనే వినియోగః |

ఉత్తమే శిఖరే దేవీ భూమ్యాం పర్వతమూర్ధని |
బ్రాహ్మణేభ్యో హ్యనుజ్ఞానం గచ్ఛదేవీ యథాసుఖమ్ ||


ఓం మిత్రస్య చర్షణీధృతః — శ్రవో దేవస్య సానసిమ్ — సత్యం చిత్రశ్రవస్తమమ్ — మిత్రో జనాన్ యాతయతి ప్రజానన్ — మిత్రో దాధార పృథివీ ముతద్యామ్ మిత్రః కృష్టీర నిమిషాభి చష్టే — సత్యాయ హవ్యం ఘృతవద్విధేమ ప్రసమిత్ర మర్తో అస్తు ప్రయస్వాన్ — యస్త ఆదిత్య శిక్షతి వ్రతేన — న హన్యతే న జీయతే — త్వోతో నైనమగ్ంహో అశ్నోతి — అంతితో న దూరాత్.

5. సంధ్యాది దేవతా వందనం & దిగ్వందనం

చేతులు జోడించి ఆయా దిక్కులకు నమస్కరించాలి:

• ఓం సంధ్యాయై నమః (తూర్పు)
• ఓం సావిత్ర్యై నమః (దక్షిణం)
• ఓం గాయత్ర్యై నమః (పడమర)
• ఓం సరస్వత్యై నమః (ఉత్తరం)
• ఓం సర్వాభ్యో దేవతాభ్యో నమో నమః
• కామోకార్షీన్ మన్యురకార్షీత్ నమో నమః
📌 అభివాదయే (గోత్రం, సూత్రం, పేరు చెప్పి నమస్కరించాలి):
అభివాదయే... [ప్రవర]... [గోత్రం]... [సూత్రం]... [శాఖ/వేదం]... [పేరు] శర్మా నామాహం అస్మి భోః ||
📌 దిక్ వందనం:
• ఓం ప్రాచ్యై దిశే నమః (తూర్పు)
• ఓం దక్షిణాయై దిశే నమః (దక్షిణం)
• ఓం ప్రతీచ్యై దిశే నమః (పడమర)
• ఓం ఉదీచ్యై దిశే నమః (ఉత్తరం)
• ఓం ఊర్ధ్వాయ నమః (ఆకాశం వైపు)
• ఓం అధరాయ నమః (భూమి వైపు)
• ఓం అంతరిక్షాయ నమః (పైకి)
• ఓం భూమ్యై నమః (నేల వైపు)
• ఓం విష్ణవే నమః (సూర్యమండలం వైపు)

ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||

శంఖచక్ర గదాపాణే ద్వారకానిలయాచ్యుత | గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతమ్ ||

ఆచమనం చేసి, పవిత్రం తీసివేసి సాత్విక త్యాగం సమర్పించాలి:

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||
SREYAS ASTRO

SREYAS ASTRO

శాస్త్రోక్త వైదిక సంకల్పాలు & జ్యోతిష్య మార్గదర్శనం

📍 Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *