SREYAS ASTRO Logo
SREYAS ASTRO | శ్రీ వైష్ణవ ఉపాకర్మ మార్గదర్శి

శ్రావణ పౌర్ణమి జంధ్యాల పూర్ణిమ సంకల్పం & మంత్రాలు 2026

యజుర్వేద ఉపాకర్మ: కామోకార్షీత్ జపం, యజ్ఞోపవీత ధారణ విధి, నవకాండర్షి తర్పణం & పితృ తర్పణ సంపూర్ణ విధానం

🌟 జంధ్యాల పూర్ణిమ / శ్రావణ పూర్ణిమ విశిష్టత & శాస్త్ర మహత్యం:

సనాతన ధర్మంలో వేదాధ్యయనానికి మరియు ఆధ్యాత్మిక అనుష్ఠానాలకు జంధ్యాల పూర్ణిమ (శ్రావణ పౌర్ణమి ఉపాకర్మ) అత్యంత పవిత్రమైన పుణ్యదినం. ఉపనయన సంస్కారం పొందిన ప్రతి ఒక్కరూ గడచిన సంవత్సరంలో అనుష్ఠాన లోపాల వల్ల కలిగిన దోషాలను నివారించుకోవడానికి మరియు నూతన సంవత్సర వేదాధ్యయనానికి అర్హత పొందడానికి ఈ ఉపాకర్మను ఆచరిస్తారు.

శ్రీవైష్ణవ సంప్రదాయంలో శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు, సప్తర్షుల మరియు పితృదేవతల అనుగ్రహం కొరకు కామోకార్షీత్ జపం, నూతన యజ్ఞోపవీత ధారణ మరియు నవకాండర్షి తర్పణములు శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి.

📅 27.08.2026 — గురువారం (Thursday)

శ్రావణ శుక్ల పౌర్ణమి (పరాభవ నామ సంవత్సరం)

📌 తిథి వివరాలు: చతుర్దశ్యాం (ఉదయం 09:54 వరకు) // పౌర్ణమాస్యాం (ఉదయం 09:55 నుండి)

1. కామోకార్షీత్ జపం (మహా సంకల్పం)

కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని ఆచమనం (అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః) చేయాలి. పవిత్ర వేలికి దర్భ పవిత్రం ధరించి, 2 దర్భలను ఆసనంగా వేసుకోవాలి.

(చేతులు జోడించి) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే, యస్యాద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే.

(కుడి తొడపై చేతులు ఉంచుకుని) శ్రీ గోవింద గోవింద గోవింద... అస్య శ్రీభగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యవహారికే ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే...

పరాభవ నామ సంవత్సరే - దక్షిణాయనే - వర్ష ఋతౌ - సింహ మాసే (శ్రావణ మాసే) - శుక్ల పక్షే - పౌర్ణమాస్యాం శుభతిథౌ - గురు వాసర యుక్తాయాం - శ్రవిష్ఠా (ధనిష్ఠా) నక్షత్రయుక్తాయాం

శ్రీవిష్ణుయోగ శ్రీవిష్ణుకరణ శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం పౌర్ణమాస్యాం శుభతిథౌ శ్రీభగవదాజ్ఞా భగవత్ కైంకర్యరూపం తైష్యాం పౌర్ణమాస్యాం అధ్యాయోత్సర్జన అకరణ ప్రాయశ్చిత్తార్థం అష్టోత్తర శత సంఖ్యా (108 సార్లు) అష్టోత్తర సహస్ర సంఖ్యా (1008 సార్లు) కామోకార్షీత్ మహామంత్ర జపం కరిష్యే.
(ఇడుకు దర్భను కింద వేయాలి)
కామోకార్షీన్ మన్యురకార్షీత్ నమో నమః
అని 108 లేదా 1008 సార్లు జపం చేసిన తర్వాత, పవిత్రం తీసివేసి ఆచమనం చేయాలి.

2. యజ్ఞోపవీత ధారణ విధి (జంధ్యం మార్చుకొనుట)

ఆచమనం చేసి, పవిత్రం ధరించి ప్రాణాయామం చేయాలి.

[సంకల్పం]:
అద్యపూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ
శ్రీ భగవదాజ్ఞా భగవత్ కైంకర్యరూపం
శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అధ్యాయోపాకర్మ కరిష్యే.
తదంగం యజ్ఞోపవీత ధారణం కరిష్యే.
తదంగం నవకాండర్షి తర్పణం కరిష్యే.

మమ శ్రౌత స్మార్త విహిత నిత్యకర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం బ్రహ్మతేజో అభివృద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిష్యే.
యజ్ఞోపవీత ధారణ మంత్రస్య బ్రహ్మా ఋషిః (శిరస్సును స్పృశించాలి)
అనుష్టుప్ ఛందః (ముక్కును తాకాలి)
త్రైవిద్యా దేవతా (హృదయాన్ని తాకాలి)
యజ్ఞోపవీత ధారణే వినియోగః

నూతన యజ్ఞోపవీతం చేతిలోకి తీసుకుని, బ్రహ్మముడి పైకి ఉండేలా ఉంచి క్రింది మంత్రం చదువుతూ ధరించాలి:

యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ |
ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||

(గృహస్థుల కొరకు - రెండవ జంధ్యం)

శ్రీ భగవదాజ్ఞా భగవత్ కైంకర్యరూపం
గృహస్థార్థం సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే

(మునుపటిలాగే ఋషి ఛందో దేవతా ధ్యానం చేసి, మంత్రం చదువుతూ రెండవ జంధ్యం ధరించాలి).

యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ |
ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||

3. నవకాండర్షి తర్పణం

పాత మరియు కొత్త జంధ్యాలు రెండింటినీ మాలలా (ఉపవీతంగా) వేసుకుని, బ్రహ్మముడి రెండు చేతుల మధ్య ఉండేలా చూసుకుని, అక్షతలు మరియు నువ్వులు కలిపి నీటితో చేతుల వేళ్ళ కొనల ద్వారా (దేవతీర్థం) తర్పణం వదలాలి.

1. ప్రజాపతిం కాండర్షిం తర్పయామి (3 సార్లు)
2. సోమం కాండర్షిం తర్పయామి (3 సార్లు)
3. అగ్నిం కాండర్షిం తర్పయామి (3 సార్లు)
4. విశ్వాన్ దేవాన్ కాండర్షిం తర్పయామి (3 సార్లు)
5. సాంగుహీతీర్ దేవతా ఉపనిషదః తర్పయామి (3 సార్లు)
6. యాజ్ఞికీర్ దేవతా ఉపనిషదః తర్పయామి (3 సార్లు)
7. వారుణీర్ దేవతా ఉపనిషదః తర్పయామి (3 సార్లు)
📌 అరిచేతి వెనుక భాగం నుండి నీరు వదలాలి (బ్రహ్మ తీర్థం):
• బ్రహ్మాణం స్వయంభువం తర్పయామి
📌 క్రింది మంత్రాలతో నేరుగా తర్పణం వదలాలి:
• సదసస్పతిం తర్పయామి
• ఋగ్వేదం తర్పయామి
• యజుర్వేదం తర్పయామి
• సామవేదం తర్పయామి
• అథర్వణవేదం తర్పయామి
• ఇతిహాసం తర్పయామి
• పురాణం తర్పయామి
• కల్పం తర్పయామి

✅ తండ్రిగారు ఉన్నవారు పూర్తి చేయు పద్ధతి:

జంధ్యాన్ని యథావిధిగా ఎడమ భుజంపై వేసుకుని (ఉపవీతం), పాత జంధ్యాన్ని తీసివేయడానికి క్రింది మంత్రం చెప్పాలి:

ఉపవీతం భిన్నతంతుం జీర్ణం కశ్మల దూషితం విసృజామి హరే బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే

ఆచమనం చేసి, భగవత్ సమర్పణ చేయాలి:

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||

(తండ్రిగారు ఉన్నవారికి ఇంతటితో జంధ్యాల పూర్ణిమ ఉపాకర్మ అనుష్ఠానం పూర్తవుతుంది).

⚠️ తండ్రిగారు లేనివారు మాత్రమే చేయవలసిన పితృ తర్పణం:

జంధ్యాన్ని ప్రాచీనావీతంగా (కుడి భుజంపై) వేసుకోవాలి.
(ప్రతి మంత్రానికి 3 సార్లు బొటనవేలి గుండా నల్ల నువ్వులు & నీటితో పితృతీర్థం ద్వారా తర్పణం వదలాలి).

1. తాన్ పితౄన్ తర్పయామి (3 సార్లు)
2. సర్వాన్ పితౄన్ తర్పయామి (3 సార్లు)
3. సర్వపితృగణాన్ తర్పయామి (3 సార్లు)
4. సర్వపితృపత్నీః తర్పయామి (3 సార్లు)
5. సర్వపితృగణపత్నీః తర్పయామి (3 సార్లు)

అనంతరం జంధ్యాన్ని ఉపవీతంగా (ఎడమ భుజంపై) మార్చుకుని, పాత జంధ్యాన్ని తీసివేయాలి:

ఉపవీతం భిన్నతంతుం జీర్ణం కశ్మల దూషితం విసృజామి హరే బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే

ఆచమనం చేసి సాత్విక త్యాగం సమర్పించాలి:

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||
SREYAS ASTRO

SREYAS ASTRO

శాస్త్రోక్త వైదిక సంకల్పాలు & జ్యోతిష్య మార్గదర్శనం

📍 Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *